ఈ సంవత్సరం హీరో తేజా సజ్జా నుంచి వచ్చిన చిత్రం జోంబీ రెడ్డి. ఈ సినిమా ప్రేక్షకుల ఆధరణ పొందింది. ఇప్పుడు తేజ ఇంకో చిత్రం తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఎస్.ఎస్.రాజు దర్శకత్వం వహించిన ఇష్క్ సినిమా తో తేజ మన ముందుకి రానున్నాడు. ఈ ఇష్క్ మూవీ తన కెరియర్ లో రెండో చిత్రం. ఈ సినిమా యొక్క ట్రైలర్‌ను చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసింది. ఈ సినిమా ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇష్క్ మూవీ ట్రైలర్ చుస్తే, తేజ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ యొక్క అందమైన ప్రేమకథతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. వారు ఒకరినొకరు ఎంతో ఇష్టంగా ప్రేమించుకుంటారు. ప్రియా పుట్టినరోజు సందర్బంగా తేజ తనని బీచ్‌కు తీసుకెళ్లే ప్లాన్ వేస్తాడు. వారు కారులో వెళ్తుండగా తేజ, ప్రియా ను ఒక ముద్దు అడుగుతారు. వారు ముద్దు పెట్టుకునేటప్పుడు, మనం దానిని ఒక అందమైన లవ్స్టోరీగా ఊహించుకుంటాము కానీ తర్వాత వచ్చే సీన్స్ పూర్తి విరుద్ధంగా ఉంటాయి.

“నాట్ ఏ లవ్ స్టోరీ” అన్న ట్యాగ్‌లైన్‌కు ఈ ట్రైలర్ సరిగా సరిపోతుంది. ట్రైలర్ లో ఒక్క డైలాగ్ కూడా లేనప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎస్.ఎస్.రాజు తొలిసారిగా వేరే సబ్జెక్టుతో మన ముందుకు వస్తున్నాడు. మహతి స్వర సాగర్ యొక్క బ్యాక్ గ్రౌండ్ స్కోర్ భయాన్ని కలిగిస్తుంది.

ఈ చిత్రాన్ని ఎన్‌వి ప్రసాద్, పరస్ జైన్, వాకదా అంజాన్ కుమార్ నిర్మిస్తుండగా, ఆర్‌బి చౌదరి ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ప్రదర్శిస్తున్నారు.

x