తేజా సజ్జా మరియు ప్రియా ప్రకాష్ వారియర్ కలిసి నటించిన సినిమా ఇష్క్. ఈ సినిమా ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్.ఎస్.రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ఈ రోజు వేణు శ్రీరామ్ ముఖ్య అతిథిగా మరియు సుందీప్ కిషన్, నారా రోహిత్, శ్రీ విష్ణు, నందిని రెడ్డి, మరియు ప్రశాంత్ వర్మ అతిథులుగా హాజరయ్యారు.

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ, తేజ కెరీర్ మొదటి దశలోనే మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ క్రింద పనిచేసే అవకాశం రావడం చాలా అదృష్టం అని చెప్పారు. “తేజా ఇష్క్ తో మరో హిట్ కొట్టాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.”

నారా రోహిత్ మాట్లాడుతూ, తేజకు సినిమా పట్ల మక్కువ ఎక్కువ, వారు కలిసినప్పుడల్లా సినిమా తప్ప మరేమీ మాట్లాడరని నారా రోహిత్ అన్నారు.

నటి ప్రియా ప్రకాష్ వారియర్ మాట్లాడుతూ, “ఇది తెలుగులో నా రెండవ చిత్రం. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమా లోని పాత్రను నేను చేయగలనని నమ్మినందుకు నిర్మాతలు మరియు ఎస్.ఎస్.రాజు గారికి నా కృతజ్ఞతలు. అలాగే నాతో పాటు కలిసి నటించిన తేజకు కూడా కృతజ్ఞతలు. ”

వేణు శ్రీరామ్ ఎస్.ఎస్.రాజు గురించి మాట్లాడుతూ, మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాతలకు కృతజ్ఞతలు రాజుకి ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎన్‌వి ప్రసాద్ గారు‌ ఎం.సి.ఎ సినిమా విడుదలైన తర్వాత నాకు అడ్వాన్స్ ఇచ్చారు, కానీ కొని అనివార్య కారణాల వల్ల ఆయనతో మూవీ చేయలేక పోయాను. తేజకు ఇష్క్ సినిమా మరో హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. దర్శకుడు రాజు నా ఎంసీఏ మరియు వకీల్ సాబ్ చిత్రాలకు పనిచేశారు. అతను మాస్ యొక్క పల్స్ అంచనా వేసే నైపుణ్యం కలిగినవాడు.

తేజా మాట్లాడుతూ, “మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ ‌తో పనిచేయడం నాకు చాలా గౌరవం. మా చిత్రాని సపోర్ట్ చేస్తూ ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా కృతజ్ఞతలు. వకీల్ సాబ్‌తో 100 cr ఫిల్మ్‌ను అందించిన దర్శకుడు వేణు శ్రీరామ్ గారు. ఈ సందర్భంగా వేణు శ్రీరామ్ గారు ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు హాజరైనందున మాకు 100 cr లభించినంత ఆనందంగా ఉంది. ఆయన ఉగాది పండగను వకీల్ సాబ్ రూపంతో మనకు 4 రోజులు ముందుగానే అందించారు.

ఇష్క్ చిత్రం ఈ నెల 23 న విడుదలవుతోంది. నిర్మాతలు కోరుకుంటే, ఏ స్టార్ హీరోతోనైనా సినిమా చేయవచ్చు. కానీ, వారు కథను బలంగా నమ్మి, వారి కం బ్యాక్ చిత్రానికి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ చిత్రం కుటుంబ సభ్యులందరితో పాటు చూడవచ్చు. ”

x