ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ తర్వాత, ఎనెర్జిటిక్ రామ్ మరిన్ని మాస్ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అటువంటి మాస్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ దర్శకుడు బోయపాటి శ్రీను. తాజా సమాచారం ప్రకారం, ఎనెర్జిటిక్ రామ్ మొట్ట మొదటి సారిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ద్వారక క్రియేషన్స్ మరియు శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌లపై మిరియాల రవీందర్ రెడ్డి మరియు శ్రీనివాస్ చిట్టూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
ప్రస్తుతం రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా యాక్షన్ మూవీనే. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను తెలుగు మరియు తమిళం లో తెరకెక్కిస్తున్నారు. మరో వైపు, బోయపాటి శ్రీను ‘అఖండ’ సినిమా తో బిజీగా ఉన్నారు.