ఇస్మార్ట్ శంకర్ లో గ్లామర్ ట్రీట్ తో ఆలరించిన నభా నటేష్ యువకుల హృదయాలను కొల్లగొట్టారు. ఈ యువ నటి తెలుగు ప్రేక్షకులలో విపరీతమైన అభిమానాన్ని సంపాదించుకుంది. నభా నటేష్ సినిమాల్లో ఆకర్షణీయమైన పాత్రలు పోషించడమే కాకుండా, ఆమె ఫోటోషూట్లలో కూడా అంటే గ్లామర్ ను చూపిస్తుంది.
నభా నటేష్ ఇటీవల ఎంటర్టైన్మెంట్ మరియు లైఫ్ స్టైల్ పత్రిక అయిన రెడ్ యొక్క కవర్ పేజీకి పోజులిచ్చింది. ఈ ఫోటో లో, నభా నటేష్ రెడ్ కలర్ మోడరన్ డ్రెస్సును ధరించి కనిపించింది, మరొక ఫొటో లో, ఆమె అదే దుస్తులు ధరించింది, కాని అది బ్లాక్ కలర్ లో ఉంది. రెండు ఫోటోలలో, నభా నటేష్ సూపర్ హాట్ గా కనిపించింది.
రెడ్ మ్యాగజైన్ అధికారికంగా ట్విట్టర్ వేదికగా ఈ ఫొటోస్ ను ట్వీట్ చేసారు, “ఇంకా మే నెల కూడా రాలేదు మరి ఇంత వేడిగా ఉంది. మా కవర్ పేజీలో ఇస్మార్ట్ శంకర్ ఫేం నభ నాటేష్ యొక్క ఫొటోస్ చూడటానికి కూడా అంటే హాట్ గా ఉన్నాయి. సైలెంట్ గా సినీ పరిశ్రమలో అగ్రస్థానాలకు చేరుకున్న నభ నాటేష్ త్వరలోనే అంధధున్ తెలుగు రీమేక్‌లో రాధికా ఆప్టే చేసిన పాత్రను పోషించనున్నారు”
“కన్నడలో తన మొదటి చిత్రం కోసం నభ నాటేష్ గుర్రపు స్వారీ మరియు బీడీ-స్మోకింగ్ నేర్చుకోవలసి వచ్చింది. ప్రఖ్యాత నటుడు శివ రాజ్‌కుమార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మరింత ఆనందంగా ఉందని చెప్పారు.పైన చెప్పినట్లుగా, నభ నాటేష్ తరువాత అంధధున్ యొక్క తెలుగు రీమేక్ లో కనిపిస్తుంది. మెర్లపాకా గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, తమన్నా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ తెలుగులో మాస్ట్రో గా రిలీజ్ చేస్తున్నారు.