ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ మైనింగ్ డవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 89 ఖాళీలకు దరఖాస్తులు తీసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న వారు ఈ నెల 22 లోపు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అయితే చాలా వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
మొత్తం 89 ఖాళీలకు ఉండగా.. లెయిజనింగ్ ఆఫీసర్ విభాగంలో 2 ఖాళీలు, కొల్లియర్ ఇంజనీర్ విభాగంలో 2 ఖాళీలు, సర్వేయర్ విభాగంలో 2 ఖాళీలు, ఎలక్ట్రికల్ ఓవర్మెన్ విభాగంలో 4 ఖాళీలు, మైనింగ్ ఇంజనీర్ విభాగంలో 12 ఖాళీలు ఉన్నాయి. దీనితో పాటు మైన్ ఓవర్మెన్ విభాగంలో 25 ఖాళీలు, మైన్ సిర్దార్ విభాగంలో మరో 38 ఖాళీలు ఉన్నాయి. అయితే వేర్వేరు పోస్టులకు సంబంధించి వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తులను అప్లై చేసుకోవడానికి టెన్త్, ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్, పీజీ, పీజీ డిప్లొమో చేసిన వారు ఆయా విద్య అర్హతలను కలిగి ఉండాలి. ఈ జాబ్స్ యొక్క పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 2 వ తేదీ నుంచి ప్రారంభమైంది. కనుక అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో ఈ నెల 22లోగా దరఖాస్తును ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. వేర్వేరు ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన వారికి వేర్వేరుగా వేతనాలను ఇవ్వనున్నారు. పోస్టు ఆధారంగా రూ. 40 వేల నుంచి రూ. 90 వేల వరకు వేతనం ఇవ్వనున్నారు.