మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుటకు రంగం సిద్ధమైంది. నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల ఎల్లుండు బీజేపీ పెద్దల సమక్షంలో కమల దళం లో చేరనున్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు ఉదయం 10 గంటలకు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నారు. 11 గంటలకు తన రాజీనామా లేఖను ఈటల స్పీకర్ కార్యాలయం లో ఇవ్వనున్నారు. వారం రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన ఈటల రాజేందర్ బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

బీజేపీ నేతలతో కలిసి స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న ఈటల ఎల్లుండి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నారు.

x