RCB vs CSK మ్యాచ్ హైలైట్స్:

వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చెన్నై సూపర్ కింగ్స్ బ్రేకు వేసింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో చెన్నై జట్టు రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్టును 69 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. చెన్నై టీమ్ను మొత్తం తానై రవీంద్ర జడేజా బెంగళూరు జట్టుకు చెమటలు పట్టించాడు.

ఒక్క అంపైర్ చేశేపనిని మినహాయిస్తే, మైదానంలో జడేజా అన్ని విభాగాల్లో తన సత్తా చాటి బెంగళూరు జట్టుకు ఓటమి రుచి చూపించాడు. మొదట బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించిన జడేజా ఆ తర్వాత బౌలింగ్లో మరియు ఫీలింగ్ లో కూడా తన సత్తా చాటి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు.

CSK బ్యాట్టింగ్ హైలైట్స్:

మొదట టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్టింగ్ ను ఎంచుకుంది. చెన్నై ఓపెనర్స్ రుతురాజ్ గైక్వాడ్ 25 బంతుల్లో 33 పరుగులు, డుప్లిసిస్ 41 బంతుల్లో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత దిగిన రైనా 18 బంతుల్లో 24 పరుగులు చేసి కాసేపు మెరుపులు మెరిపించి ఔటయ్యాడు. ఆ తర్వాత చెన్నై రన్ రేట్ తగ్గుతూ వచ్చింది.

జట్టు స్కోరు 111 పరుగుల వద్ద రైనా అవుట్ అయ్యాక, అసలు విధ్వంసం మొదలైంది. గ్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా మొదటి బంతి నుంచి బెంగళూరు బౌలర్లు పై విరుచుకుపడ్డారు. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లో జడేజా ఏకంగా 37 పరుగులు చేసి చెన్నై జట్టు 191 పరుగులు చేయడానికి సహకరించాడు. ఆ చివరి ఓవర్లో జడేజా ఐదు సిక్సర్లు, ఒక ఫోర్, ఒక డబుల్ రన్ కొట్టాడు, అందులో నో బాల్ కూడా ఉంది. జడేజా 28 బంతుల్లో మొత్తం 62 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్స్ లో అక్షర్ పటేల్ 3 వికెట్లు తీయగా,చాహల్ ఒక వికెట్ తీశాడు.

RCB మ్యాచ్ హైలైట్స్:

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగుళూరు ఓపెనర్ దేవదూత్ పాడిక్కాల్ వేగంగా ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. కేవలం 15 బంతుల్లో 34 పరుగులు చేసి జట్టుకు మంచి ప్రారంభాన్ని ఇచ్చాడు. మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ 7 పరుగులకే అవుట్ అయిపోయాడు. బెంగళూరు మొదటి రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత మ్యాక్స్వెల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దటానికి ప్రయత్నం చేశాడు.

కానీ రవీంద్ర జడేజా బౌలింగ్ వేయటం మొదలు పెట్టిన తర్వాత మ్యాచ్ పూర్తిగా చెన్నై చేతిలోకి లోకి వెళ్లి పోయింది. మాక్స్వెల్ మరియు ఎబి డెవిలియర్స్ ను బౌల్డ్ చేసి జడేజా మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశాడు. చెన్నై బౌలర్ల ధాటికి బెంగళూరు 9 వికెట్ల నష్టానికి 122 పరుగుల వద్ద ఆగిపోయింది. చెన్నై బౌలర్లలో జడేజా 3 వికెట్లు, ఇమ్రాన్ తాహిర్ 2 వికెట్లు తీయగా, శార్దుల్ ఠాకూర్ మరియు శ్యామ్ కరణ్ చెరొక వికెట్ తీశారు.

x