ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో భారీ హిట్ అందుకున్న నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జాతిరత్నాలు. ఫరియ అబ్దుల్లా హీరోయిన్ గా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో చిత్రాన్ని అనుదీప్ కే వి తెరకెక్కించారు.
దర్శకుడు నాగ అశ్విన్, ఈ చిత్రానికి నిర్మాతగా మారాడు. ఈ సినిమా మహా శివరాత్రి సందర్బంగా, మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది ఈ జాతిరత్నాలు.
అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ తోనే చూడాలనే ఆసక్తిని పెంచింది. దానికితోడు సినిమా యూనిట్ చేసిన ప్రమోషన్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి. డార్లింగ్ ప్రభాస్, దేవరకొండ విజయ్ ప్రమోషన్స్ లో భాగం కావటంతో సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేర్చాయి.
మరి ఆ స్థాయి అంచనాలను ఈ మూవీ అందుకుంటుందా? లేదా? నవీన్ పొలిశెట్టికు మరో సారి విజయాన్ని అందిచ్చిందా లేదా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Jathi Ratnalu Movie Story Analysis
ముందుగా కథ విషయానికి వస్తే ఉద్యోగం కోసం సిటీకి వచ్చే ముగ్గురు కుర్రాళ్ల జీవితంలో జరిగిన ఊహించని సంఘటను ఫన్నీగా చూపిస్తూ తీసిన చిత్రమే జాతిరత్నాలు. జోగిపేట్ శ్రీకాంత్ అతని ఇద్దరు మిత్రులు ఉద్యోగం కోసం హైదరాబాద్ కి వస్తారు. అదే సమయంలో జోగిపేట్ శ్రీకాంత్ చిట్టిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. మరోప్రక్క ఒక స్పోర్ట్స్ మినిస్టర్ అరాచకాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతడు ఒక మర్డర్ చేస్తాడు, అయితే ఆ స్పోర్ట్స్ మినిస్టర్ ఈ ముగ్గురు ఫ్రండ్స్ ని ఆ కేసులో ఇరికిస్తాడు.
చెయ్యని నేరానికి అమాయకులు అయిన ముగ్గురు ఫ్రెండ్స్ జైలుకి వెళ్తారు. మరి అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి? వారు జైలు నుంచి ఎలా బయటపడరు? అసలైన జాతిరత్నాలు అనిపించుకున్నారా? లేదా? మధ్యలో స్పోర్ట్స్ మినిస్టర్ ఆట ఎలా కట్టించారు? చిట్టి శ్రీకాంత్ ప్రేమ ఏమైంది? వీటన్నిటికీ సమాధానమే ఈ జాతిరత్నాలు.
సినిమా విశ్లేషణ విషయానికి వస్తే జోగిపేట్ శ్రీకాంత్ గా నవీన్ పోలిశెట్టి ఎంట్రీతో సినిమా ఆసిక్తికరంగా సాగుతుంది, కీర్తిసురేష్ కూడా కనిపించడం సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు నవీన్ ఫ్రండ్స్ గా ఎంట్రీ ఇవ్వడం, వారు హైదరాబాద్ వెళ్ళటం వంటివి అన్ని సరదాగా సాగిపోతూ నవ్విస్తాయి.
నవీన్, ఫరియా మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు, అలాగే వారిద్దరి మధ్య కొన్ని కామెడీ సీన్స్ అలరిస్తాయప్రథమార్ధం మొత్తం ఆశించిన మంచి కామెడీ ఇందులో కనిపిస్తుంది. సాంగ్స్, సందర్భానికి తగ్గట్టు కామెడీ బాగుంది. ముగ్గురు కూడా నవ్వులు పంచారు.
ఇక హీరోయిన్ కూడా సెన్స్ అఫ్ హుమొర్ తో నవ్విస్తుంది. మినిస్టర్ క్రైమ్ సన్నివేశాలు కూడా సరదాగా సాగిపోవడం నచ్చుతుంది. సెకండ్ హాఫ్ నుండి అసలు కథలోకి సినిమా ఎంటర్ అవుతుంది. ఇక వీళ్ళు జైలుకి వెళ్లడం, అక్కడ చేసే పనులు మరింత నవ్వు తెప్పిస్తాయి. అయితే సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. అదొక్కటే మైనస్, మిగతా అంతా ఆకట్టుకునేలానే ఉంటుంది.
ఒకరకంగా చెప్పాలంటే, ఇలాంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీని ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదని కొనియాడుతున్నారు. మరీ ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి, ప్రియా దర్శి, రాహుల్ రామకృష్ణ పండించిన కామెడీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిందని చెప్పవచ్చు. అయితే ద్వితీయార్ధం కూడా అలాగే ఉంటే మరింత గొప్పగా ఫలితం ఉండేది. కానీ ఓవరాల్ గా మాత్రం సినిమా నచ్చుతుంది.
ఇక నటీనటులు విషయానికొస్తే కామెడీ ప్రధానంగా సాగిన ఈ మూవీలో నవీన్ పోలిశెట్టి అదరగొట్టేసాడు. తనదైన కామెడీతో నవ్వులు పువ్వించాడు. అతనికి రాహుల్, ప్రియదర్శి తోడుపాటును అందించారు. ముగ్గురు కూడా నవ్వులతో హోరెత్తించే ప్రయత్నం చేసారు.
అమాయకులుగ కనిపిస్తూనే, అవసరమైనప్పుడు తెలివిని ప్రదర్శించే క్యారెక్టర్ లలో అల్లుకుపోయారు. ఇక హీరోయిన్ పాత్ర తక్కువే అయినా ఆకట్టుకుంది. ఇందులో చిన్న చిన్న పంచ్ డైలాగులే హైలైట్ గా నిలిచాయి. మురళి శర్మ అలవాటైన నటనతో ఆకట్టుకున్నాడు.
చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం తెరపై కనిపించి నవ్వులు పూయించారు. జడ్జిగా కనిపించింది తక్కువే అయినా, తన మార్కుని చూపించారు. చిట్టి ఫాదర్ గా నరేష్, MLA గా బ్రహ్మాజీ ఆకట్టుకున్నారు. అలాగే వెన్నెల కిషోర్, తనిక్కెళ్ల భరణి, గిరిబాబు వంటి వారు మెప్పిస్తారు. మిగతా నటీనటులు పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
Technical Analysis
ఇక సాంకేతిక విషయానికొస్తే, జాతిరత్నాలు మూవీ కొద్ది రోజులుగా అటు సోషల్ మీడియాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్ హాట్ టాపిక్ అవుతుంది. ఇందుకు కారణం ఈ సినిమాకు
అదిరిపోయే రేంజీలో ప్రమోషన్ కార్యక్రమాలు చేయటమే. దీనిలో మేకర్స్ పాత్ర కీలకం, అదే పనితీరు సినిమాలో కూడా కనిపిస్తుంది.
అనుదీప్ తాను అనుకున్న కథను తెరపై పక్కాగా తెరకెక్కించటంలో విజయవంతం అయ్యాడని చెప్పవచ్చు. చాలా వరకు కామెడీతో పండించే ప్రయత్నం చేసారు. కొత్తవాడు అయినా అనుకున్న రీతిలో రూపొందించాడు. రధన్ సంగీతం ఆకట్టుకుంటుంది, సాంగ్స్ తో పాటు నేపథ్యం, సంగీతం మెప్పిస్తుంది.
మనోహర్ సినిమాటోగ్రఫీ బాగుంది, అభినవ్ ఎడిటింగ్ కూడా ఓకే, సెకండ్ హాఫ్ లో కొంత ట్రిమ్ చేస్తే మరింత బాగుంటుంది. వైజయంతి ప్రొడక్షన్ విలువలు బాగున్నాయి. టెక్నికల్ పరంగా సినిమా ఓ స్థాయిలో ఉంది.
మొత్తంగా చూసినట్లయితే, టాలీవుడ్ లో ఉన్న యంగ్ కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శితో కలిసి హీరో నవీన్ పోలిశెట్టి చేసిన హంగామా ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే, సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.
Jathi Ratnalu Movie Rating
3/5