జాతి రత్నాలు మూవీ తెలుగులో పెద్ద హిట్ అయింది. ఈ సినిమా లో నవీన్ పోలిశెట్టి చాలా అద్భుతంగా నటించారు. అందరికంటే ఎక్కువగా ఈ సినిమా “ఫరియా అబ్దుల్లా” కు హీరోయిన్ గా మంచి పేరును తీసుకువచ్చింది. ఆమె ఈ సినిమా ద్వారా చాలా ప్రసిద్ధి చెందారు. కానీ పెద్ద సినిమాల్లో అవకాశాలు మాత్రం రాలేదు.

కానీ ఇప్పుడు ‘ఢీ’ సీక్వెల్ సినిమాలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా ఎంపిక అయ్యారు. 2007 లో విడుదలైన అత్యంత వినోదాత్మక చిత్రాలలో ‘ఢీ’ సినిమా ఒకటి. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమా సీక్వెల్ కోసం మరోసారి శ్రీను వైట్ల మంచు విష్ణుతో కలిసి పని చేయనున్నారు. ఈ సినిమాకు ఫరియా అబ్దుల్లా సరైన ఎంపిక అని విష్ణు భావిస్తున్నారు. అధికార ప్రకటన కోసం కొన్ని రోజులు వేచి ఉండాలి. ఈ సినిమా ఆమెకు ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు.

ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ నిర్మించనుంది. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే గోపి మోహన్ మరియు కిషోర్ అందించారు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చనున్నారు. మరోవైపు, మంచు విష్ణువు చివరిసారిగా మొసగల్లు సినిమాలో నటించారు.

x