గత కొన్ని రోజులు నుండి విక్టరీ వెంకటేష్ మరియు రానా దగ్గుబాటి కలిసి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి. సబ్జెక్ట్ బాగుంటే తాము వెబ్ సిరీస్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ ఇద్దరూ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ గురించి మరొక వార్త కూడా సోషల్ మీడియా హాల్ చల్ అవుతుంది.

ఈ వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్ర కోసం మేకర్స్ కాజల్‌ అగర్వాల్‌ చెల్లి ‘నిషా అగర్వాల్‌’ ను సంప్రదించినట్లు సమాచారం. నిషా అగర్వాల్‌ ‘ఏమైంది ఈవేళ’, ‘సోలో’, ‘సుకుమారుడు’, ‘సరదాగా అమ్మాయితో’ వంటి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. ఆమె చివరిగా 2014లో విడుదలైన ‘కజిన్స్‌’ అనే మలయాళ చిత్రం లో కనిపించారు.

2013 లో వివాహం చేసుకున్న ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఈ వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే, ఆమె పాత్రకు సంబంధించిన వివరాలు మరియు మేకర్స్ నుండి అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. అయితే, వీరి కాంబినేషన్‌లో వెబ్‌ సిరీస్‌ ఉంటుందా.. లేదా.. అనేది చూడాలి.

 

x