“కనబడుటలేదు” సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాకు M. బాలరాజు తొలి దర్శకుడు గా పరిచయం అయ్యాడు. వీరెల్ల సుక్రాంత్ కథానాయకుడిగా, సునీల్ డిటెక్టివ్ గా ఒక కీలక పాత్రలో కనిపించారు. మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేశారు.
తప్పిపోయిన వ్యక్తి యొక్క పోస్టర్ ను మరియు ఫుడ్ డెలివరీ బాయ్ ను చూపిస్తూ టీజర్ ను ప్రారంభించారు. సునీల్ తన వీధుల్లో కఠినమైన డిటెక్టివ్ గా కనిపించారు. టీజర్లో ప్రముఖ పాత్రల యొక్క రెండు కోణాలను చూపించడం ప్రత్యేకమైన విషయం.
ఈ టీజర్ లో ఒక ముసుగు మనిషి కూడా కనిపించాడు. తల లేని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్న తర్వాత, ఆ ముసుకు మనిషి తలకిందులుగా వేలాడుతూ కనిపించిన సన్నివేశం అందర్నీ ఆకట్టుకుంది. ఆ ముసుకు మనిషి ఎవరో తెలుసుకోవడానికి సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండాలి. ఈ సినిమా త్వరలో ‘స్పార్క్’ OTT ప్లాట్ ఫామ్ లో విడుదల కానుంది.