Kapatadhaari Movie Review
హీరో సుమంత్ ఇదం జగత్ మూవీ తరువాత ఈ సినిమాలో యాక్ట్ చేసాడు. సుమంత్ 2 1/2 సంవత్సరాల తరువాత ఈ సినిమాతో మనముందుకు వచ్చాడు. అందులో ఇది ఆర్డీనరీ జోర్నర్ కాదు. థ్రిల్లర్ లోనే హై క్రేజ్ ఉండే ఇన్వెస్టిగేషన్. నాన్ తెలుగు మూవీస్ చూసేవారందరికీ ఈ సినిమా కన్నడ బ్లాక్ బస్టర్ అయిన “కవులుదారి”కి రీమేక్ అని తెలుసు.
కొంత మంది చూసి ఉంటారు, ఇంకొంత మంది రీమిక్ అవబోతుందిగా అని దీని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఈ రీమేక్ మూవీ ఎలా ఉంది అని అడిగేతే “ఇట్స్ గుడ్” అని చెప్పవచ్చు. ముందే చేపినట్టు కవులుదారి అల్ రెడీ చూసినవారికి అయితే ఆ ఒర్జినల్ బాగుంది అని అనిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం ఈ కపతాధారి ఫిలిం చూసే వాళ్ళు కచ్చితంగా త్రిల్ల్ అవుతారు.
Kapatadhaari Movie Story
కథలోకి వెళ్తే క్రైమ్ డిపార్ట్మెంట్లో SI అవ్వాలి అని అనుకోని మన హీరో గౌతమ్ పూర్ ప్రెసెంటేషన్ వల్ల ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో SI అవుతాడు. కానీ అతనిలో ఉందే క్రైమ్ కేసులు సాల్వ్ చేయాలనే ఆలోచన అతడిని గుర్తు చేస్తూనే వుంటాది.
ఇలాంటి పర్సన్ మెట్రో కన్స్ట్రక్షన్ తవ్వకాల్లో బయటపడ్డ 40 సంవత్సలా ముందు నాటి 3 గుర్తుతెలియని డెడ్ బాడీస్ కేసుని పర్సనల్ గా టేకప్ చేస్తాడు. మరి నాజర్, జయప్రకాష్ రోల్స్ ఏంటి? వాళ్ళకి ఈ కేసు కి సంబంధం ఏంటి? చివరికి హీరో ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తాడో అని తెలియాలి అంటే ఈ మూవీ చుడాలిసిందే. స్టోరీ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే, సినిమాలో ఎట్లాంటి అనవసరపు ఉండవు, డైరెక్ట్ గా కేసులోకి జంప్ అవుతుంది. నాకు బాగా నచ్చింది ఏమిటీ అంటే ఫస్ట్ ఆఫ్ లోని ఇన్వెస్టికేషన్ సీన్స్ చాలా కొత్తగా డిజైన్ చేశారు.
స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కన్నడ మూవీలో ఎలా వుంటుందో సేమ్ తెలుగులో కూడా అలానే తీసారు. ఏ మాత్రం అయిన చేంజ్ లు చేసి ఉంటే స్టోరీ వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉందేది. స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా తీశారు తమిళ్ డైరెక్టర్ అయిన ప్రదీప్ కృష్ణమూర్తి. ఇంతకముందు తీసింది రెందు సినిమాలు అయినా ఈ కవులుదారి రీమేక్ ని ఏ మాత్రం కూడా తగ్గకుండా బాగా హ్యాండిల్ చేసాడు.
తరువాత యాక్టర్స్ విషయానికి వస్తే సుమంత్ అన్న పోలీసుగా ఇది రెందో సినిమా అనే చెప్పాలి, అంటే 10 ఇయర్స్ తరువాత ఈ రోల్ ని ట్రై చేసాడు. పర్ఫెక్ట్ గా ఈ రోల్ లో సెట్ అయ్యాడు. ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ క్యారెక్టర్లో కూల్ అండ్ క్యూరియస్ గా కనిపించాడు. తర్వాత మాట్లాడుకోవలిసింది నాజర్ గారు గురించి, ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాడు, అలాగే న్యూస్ రిపోర్టర్ రోల్లో యాక్ట్ చేసిన జయప్రకాశ్ గారు యాక్టింగ్ కూడా బాగుంది.
హీరోయిన్ రోల్ లో యాక్ట్ చేసిన నందిత శ్వేతా కి అంతా స్కోప్ ఇవ్వలేదు. మూవీ స్టార్ట్ నుండే స్టోరీలోకి వెళ్లటంలో హీరోయిన్ రోల్ అక్కడక్కడ వస్తూ పోతూ ఉంటుంది. మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఆ క్లబ్ లో వచ్చే సాంగ్ ఎట్రాక్టీవ్ గా ఉంటుంది. బ్యాక్ గ్రౌడ్ మ్యూజిక్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కి చాలా బాగుంటుంది.
నేను అయితే నాజర్, జయప్రకాశ్ క్యారెక్టర్స్ కి కనెక్ట్ అవలేకపోయాను. ఇవి హీరో తో పాటు ఫుల్ లెన్త్ ఉండే క్యారెక్టర్స్. డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ మీద కాన్సంట్రేషన్ చేసి వీళ్ళ రోల్స్ ని సరిగా పట్టించుకోలేదనుకుంటా, వీళ్ళ క్యారెక్టర్స్ లో ఉండాలిసిన ఎమోషన్ మిస్ అవుతుంది. స్టోరీ పరంగా ఒరిజినల్ కి ఎలాంటి చేంజెస్ లేవు కాబట్టి బాగానే వుంటుంది. ఈ వీకెండ్లో ఈ సినిమాని చూసి త్రిల్ అవ్వండి.
Kapatadhaari Movie Rating
ఈ మూవీ కి మేము ఇచ్చే రేటింగ్ 2.5/5