హీరో కార్తీక్ కు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో మంచి మార్కెట్ ఉంది. కార్తీక్ నుంచి ఇటీవల వచ్చిన సినిమా సుల్తాన్. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్తో తెరకెక్కింది. ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు మంచి స్పందన వచ్చినప్పటికీ, కరోనా వైరస్ భయం వల్ల చాలా మంది ప్రేక్షకులు థియేటర్స్ లోకి వెళ్లలేదు.
థియేటర్స్ లో చూడని వారు ఇప్పుడు ఈ సినిమాను ఆహాలో చూడవచ్చు. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ డిజిటల్ హక్కులను ఆహా కొనుగోలు చేసింది. తమిళ వెర్షన్ యొక్క డిజిటల్ హక్కులను డిస్నీ + హాట్‌స్టార్ దక్కించుకుంది మరియు ఈ సినిమా మే 2 నుండి డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ అయినా ఆహా మరియుడిస్నీ + హాట్‌స్టార్ లో ప్రసారం కానుంది.
బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన సుల్తాన్ సినిమాలో రష్మిక మండన్న హీరోయిన్ పాత్రలో నటించింది. ఈ సినిమా చాలా ఆకర్షణీయంగా మరియు వినోదాత్మకంగా ఉంటుంది.