యంగ్ హీరో రామ్ మొదటిసారి ఒక భారీ బడ్జెట్ సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చారు. ఈ సినిమాలో వంటలక్క కు ఒక పాత్ర దక్కినట్లు తెలుస్తోంది. ప్రేమి విశ్వనాథ్ వంటలక్క పాత్రలో ఫుల్ పాపులర్ అయింది. ఆమె బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్లో వంటలక్క క్యారెక్టర్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.

ప్రతి రోజు అందరి ఇంటి మనిషిగా ప్రేక్షకులను పలకరించిన ఆమె ఇకపై థియేటర్స్ లో కూడా రానుంది. డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమాలో వంటలక్క ను ఒక కీలక పాత్ర కోసం తీసుకున్నట్లు టాక్ నడుస్తుంది. దీని కోసం ఆమెతో చర్చలు జరపగా ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్ లో డైరెక్టర్ లింగుస్వామి తో పాటు నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఫోటోలను షేర్ చేయడం తో రామ్ సినిమాలో వంటలక్క నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాను సినిమాల్లో నటిస్తున్నట్లు గతంలోనే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం దీనికి తోడు రీసెంట్ గా ఆమె లింగాస్వామి తో మీట్ కావడంతో జనాల్లో చర్చ మొదలైంది.

ఇస్మార్ట్ శంకర్ తో తన మార్కెట్ ను పెంచుకున్న రామ్ అదే ఎనర్జీ తో ఈ సినిమాలో నటిస్తున్నారు. జులై 12వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నిజంగానే ఈ సినిమాలో వంటల అక్క నటిస్తే మాత్రం ఈ సినిమాకు భారీ డిమాండ్ వస్తుంది.

x