2014లో నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో విదులైన సినిమా కార్తికేయ. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ ను తెరకెక్కిస్తున్నారు. మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ లేదా టీజర్ ను విడుదల చేయడానికి ముందే, ఈ సినిమా యొక్క హక్కులకు చాలా డిమాండ్ వచ్చింది.
ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులు మరియు ఇతర భాషల డబ్బింగ్ హక్కులు మొత్తం కలిపి రూ. 20 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమాను సొంతంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు నిర్మించనున్నాయి. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తుండగా, హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్ నటిస్తుంది.