నటుడు, సినీ విశ్లేషకుడు అయిన కత్తి మహేష్ కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలం, చంద్రశేఖరపురం దగ్గర ప్రమాదానికి గురైంది. ఆయన కారు వేగంగ ట్రక్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన నెల్లూరు మెడికల్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? ఆయన ఎప్పుడు కోలుకుంటారు అన్న విషయం తెలియల్సి ఉంది.

ఆయన తెల్లవారుజామున విజయవాడ నుంచి చిత్తూరు జిల్లా కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు లో ఎయిర్ బాగ్స్ ఓపెన్ అయినప్పటికీ బలంగా ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కత్తి మహేష్ తో పాటు డ్రైవర్ కూడా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ ఇచ్చిన సమాచారం తోనే కత్తి మహేష్ గా గుర్తించమని పోలీసులు అంటున్నారు.

యాక్సిడెంట్ జరిగిన సమయంలో కత్తి మహేష్ డ్రైవింగ్ సీట్లో ఉండటంతో తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, ఆయన ఇనోవా కారు ముందు భాగం నుజ్జునుజ్జు గా అయింది.

x