కొద్ది రోజుల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేష్ ప్రస్తుతం చెన్నైలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన నెల్లూరు సమీపంలో జరిగింది మరియు ప్రమాదం జరిగిన వెంటనే కత్తి మహేష్ ను స్థానిక హాస్పటల్ కి తరలించారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో అతన్ని అక్కడి నుంచి చెన్నైలోని అపోలో హాస్పటల్ కి తరలించారు. తాజా నివేదికల ప్రకారం, అతనికి ప్రాణాపాయం తప్పిందని కాకపోతే గాయాలు తీవ్రంగా ఉన్నాయని అతని స్నేహితుడు వెల్లడించారు.

ఈ ఘటన జరిగినప్పటి నుంచి, చాలా మంది నెటిజన్లు కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు. అతని ముక్కు, కళ్ళు మరియు తల తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వైద్యులు దానికి సంబంధించిన అన్ని శస్త్రచికిత్సలు చేశారు. ప్రస్తుతం కత్తి మహేష్ ను పరిశీలనలో ఉంచారు. ఇంతలో, కత్తి మహేష్ కు కంటి చూపు పోయిందనే వార్తలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్నాయి.

నివేదికల ప్రకారం, అపోలో హాస్పిటల్స్ మరియు శంకర్ నేత్రాలయ వైద్యులు కత్తి మహేష్ కు కంటి శస్త్ర చికిత్స చేశారు. కానీ అతని కంటిచూపు గురించి అతని కుటుంబం మరియు స్నేహితులు ఏమి చెప్పలేదు. ఈ కఠినమైన సమయాల్లో కత్తి మహేష్ కి సహాయం చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. అయితే, అతను ఆరోగ్య భీమా సహాయంతో చికిత్స పొందుతున్నారని మరియు అతని కుటుంబ సభ్యులు కూడా కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారని అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

అతను మరికొన్ని వారాలు హాస్పటల్ లో ఉండాల్సిన అవసరం ఉందని మరియు అతని ఆరోగ్యం గురించి క్రమం తప్పకుండా అప్ డేట్స్ తెలియచేస్తామని అతని కుటుంబం మరియు స్నేహితులు చెప్పారు.

x