కీర్తి సురేష్ తాజాగా లీడ్ రోల్ లో నటించిన చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘నగేష్‌ కుమార్‌’ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ‘షార్ప్ షూటర్’ పాత్రలో కీర్తి సురేష్.. కోచ్ పాత్రలో జగపతిబాబు నటించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేశారు.

పుట్టుకతోనే బ్యాడ్ లక్ ను వెంట వేసుకొని తిరుగుతున్న ఓ పల్లెటూరి అమ్మాయి షార్ప్ షూటర్ గా ఎలా మారింది అనేదే ఈ సినిమా కథ. దాదాపు కథ మొత్తం ట్రైలర్ లోనే చూపించారు. అయితే, ఆమె జర్నీ ఎంత ఆసక్తిగా సాగిందనేది ఇందులో కీలకం. టైలర్ లో కీర్తి సురేష్ చూడటానికి కొత్తగా కనిపించింది.

టైలర్ చూస్తే, జగపతిబాబు కోచ్ గా చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి. మన దేశం గర్వపడేలా షూటర్లు ను తయారు చేయబోతున్నాను అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమౌతుంది. దీంతో మన మధ్య ఒక గొప్ప షూటర్ ఉందని ఆది పినిశెట్టి చెప్తుండగా కీర్తి సురేష్ యొక్క క్యారెక్టర్ రివీల్ అవుతుంది.

అయితే, ఆ గ్రామంలో అందరూ కీర్తి సురేష్ ను బ్యాడ్ లక్ సఖి గా చూస్తారు. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి గా ఎలా మారుతుంది అనేది ఈ సినిమా కథ. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ‘బ్యాడ్ లక్ సఖి’ నుంచి ‘గుడ్ లక్ సఖి’ గా ఎలా మారింది అనే నేపథ్యంలో చిత్రాన్ని రూపొందించారని ట్రైలర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.

దిల్ రాజు సమర్పణలో సుదీర్ చంద్ర ఈ సినిమాను నిర్మించారు. శ్రావ్య వర్మ సహనిర్మాతగా ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్ర దర్శకుడు హైదరాబాద్ కు చెందిన వారు. అయితే, బాలీవుడ్ లో స్థిరపడ్డారు. విలక్షణమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన నుండి ఓ తెలుగు సినిమా రావడం ఆసక్తికరంగా ఉంది.

x