జాగ్రత్త మీరు వారి ట్రాప్ లో పడ్డారు అంటే లక్షల రూపాయలు లాగేస్తారు, మొన్న ఒక డాక్టర్ ఇలాగే 72 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఈవెంట్ మేనేజర్ పోలీసులను ఆశ్రయించారు. ఇంతకీ అసలేం జరిగింది, సోషల్ మీడియా ఇప్పుడు వాడుకున్న వారికి వాడుకున్నంతలా తయారయింది.
మంచి చెడులను పంచుకునే ఈ వేదిక ఇప్పుడు కొంతమంది కిలాడీలకు డబ్బులు సంపాదించే ఆదాయ వనరుగా మారింది. ఎవరైనా అమాయకుడు దొరికారు అంటే చాలు లక్షల రూపాయలు లాగేస్తున్నారు. అయితే పోలీసులు సైతం అదే స్థాయిలో నిఘా పెట్టించారు. సోషల్ మీడియా మోసాలు అరికట్టే చర్యలు చేపడుతున్నారు.
న్యూడ్ వీడియోలతో అబ్బాయిలను బెదిరిస్తున్న కిలాడీ లేడీల కథ హైదరాబాదులో సంచలనంగా మారింది. అమాయక ప్రజలను మోసం చేస్తూ లక్షల రూపాయలను కొట్టేస్తున్నారు. కొందరు కిలాడీ లేడీలు వాట్స్అప్ కాల్స్ తో బడా బాబులను ట్రాప్ లోకి దించుతున్నారు. ఆకర్షణీయమైన మాటలతో నిండా ముంచుతున్నరు.
ఇటీవల ఒక డాక్టర్ ఈ కిలాడి లేడీ ట్రాప్ లో పడి 72 లక్షలు పోగొట్టుకున్నాడు. తాజాగా ఒక ఈవెంట్ మేనేజర్ ను ట్రాప్ చేసిన ఒక యువతి 10 లక్షల రూపాయలను నొక్కేసింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో న్యూడ్ కిలాడి కథ మరో సారి బయటకు వచ్చింది. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న వేధింపులు పై పోలీసులు నిఘా పెట్టారు.
ఇప్పటికే ఐదుగురు నిందితులకు హైదరాబాద్ నుండి సిసిఎస్ నోటీసులు కూడా పంపించారు. ఈ మధ్య ఎలాంటి ఫిర్యాదులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కుప్పలుతెప్పలుగా అందుతున్నాయి. మోసాలు చేసే వారు ఎప్పుడూ ఉండనే ఉంటారు జాగ్రత్తగా ఉండమని చెబుతున్నారు.