KKR vs PBKS మ్యాచ్ హైలైట్స్ :
పంజాబ్ కింగ్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్లో పంజాబ్కింగ్స్ తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇప్పటికే ఆడిన 5 మ్యాచుల్లో మూడు మ్యాచ్లు ఓడిపోయి ఆడుతున్న పంజాబ్ ఈ ఆరో మ్యాచ్లో కూడా ఘోర పరాజయాన్ని ఎదురుకుంది. అయితే ఆ జట్టులో ఇద్దరు ఆటగాళ్ల వల్ల భారీ లక్ష్యం సాధించడంలో విఫలమవుతోందని, అందుకే పంజాబ్ ఘోర ఓటమి పాలవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వారు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ నికోలాస్ పురాన్, హెన్రిక్స్ ఈ ఇద్దరి విదేశీ ఆటగాళ్లు ఇప్పటివరకు తమ స్థాయి ప్రదర్శన చేయకపోవడంతో వారు జట్టుకు అదనపు భారంగా మారారు. మరోవైపు డేవిడ్ మలన్ లాంటి ప్రపంచ స్థాయి బ్యాట్స్మెన్కు పంజాబ్ జట్టు ఎందుకు అవకాశం కల్పించడం లేదు అంటూ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
PBKS బ్యాట్టింగ్ హైలైట్స్ :
టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. బ్యాట్టింగ్ చేయడానికి బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్ది సేపటికే కెప్టెన్ రాహుల్ వికెట్ కోల్పోయింది. ఆ తరువాత దిగిన క్రిస్ గేల్ మరియు దీపక్ హోదా కూడా ప్రేవిలియన్ చేరారు. మయాంక్ అగర్వాల్ మాత్రం కొద్ది సేపు క్రీజ్లో ఉంది 34 బంతుల్లో 31 పరుగులు చేసి అవుటయ్యాడు.
మయాంక్ అగర్వాల్ కూడా అవుట్ అయిన తర్వాత పంజాబ్కింగ్స్ లో ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేరు. క్రిస్ జోర్డాన్ చివరిలో అద్భుతంగా ఆడటంతో పంజాబ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రిస్ జోర్డాన్ కేవలం 18 గంటల్లో 30 పరుగులు చేశాడు. కోల్కతా బౌలర్లు లో ప్రసిద్ధ కృష్ణ మూడు వికెట్లు తీయగా, కమిన్స్ మరియు సునీల్ నారాయణ్ రెండు వికెట్స్ చొప్పున తీశారు. శివమ్ మావి మరియు వరుణ్ చక్రవర్తి చెరొక వికెట్ తీశారు.
KKR బ్యాట్టింగ్ హైలైట్స్ :
124 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 9 పరుగులకే ఓపినర్ల వికెట్లు కోల్పోయింది. తర్వాత వచ్చిన సునీల్ నరైన్ కూడా సరిగ్గా ఆడలేదు ఫలితంగా 15 పరుగులకే కోల్కతా జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే పనిలో పడ్డాడు.
రాహుల్ త్రిపాఠి 32 బంతుల్లో 42 పరుగులు చేయగా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చివరి వరకు నిలబడి 40 బంతుల్లో 47 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, హెన్రిక్స్, దీపక్ హోదా, అర్షదీప్ సింగ్ ఒకొక్క వికెట్ తీసుకున్నారు.