నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా తో మన ముందుకు రానున్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రసుతం నాని రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పేరు శ్యామ్ సింగ రాయ్. వెంకట్ బోయనపల్లి బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా హైదరాబాద్ లోని 10 ఎకరాల భూమిలో భారీ సెట్ నిర్మించారు. కోల్‌కతా ను వర్ణించే ఈ సెట్‌లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. శ్యామ్ సింగ రాయ్ కోల్‌కతా నేపథ్యంలో నిర్మించిన పీరియాడిక్ చిత్రం.

నిర్మాత హైదరాబాద్‌లో భారీ సెట్ కోసం 6.5 Cr ఖర్చు చేశారు. ఈ సినిమా పై ఆయనకు చాలా నమ్మకం ఉన్నందున, ఈ చిత్రానికి భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఈ చిత్రంలో నాని పూర్తిగా న్యూ లుక్ తో కనిపించనున్నాడు మరియు బెంగాలీ కి చెందిన వ్యక్తిగా అతని ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి మరియు కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

x