యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ తన తొలి చిత్రం ‘ఉప్పెన’ తో సూపర్ హిట్ అందుకున్నారు. అన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారంగా డైరెక్టర్ క్రిష్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గానటిస్తున్నారు.

సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేయాల్సిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి కొన్ని కారణాల వల్ల సొంత ఊరుకి వెళ్ళి, అక్కడ ఉన్న తమ పశువులను తీసుకుని, ఊరి కుర్రాళ్ళతో కలిసి క్రూర మృగాలు ఉన్న అడివికి వెళతాడు. ఆ అడవిలో యువకుల బృందం తన పశువులను ఎలా కాపాడుకోగలిగింది అనేదే ఈ సినిమా కథ.

తాజాగా చిత్రబృందం ఒక గ్లింప్స్ ను విడుదల చేసింది. ఆ గ్లింప్స్ లో ఈ చిత్రం యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆగష్టు 20న ఉదయం 10:15 గంటలకు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో సినిమా ప్రమోషన్లు ప్రాంభమయ్యాయి అని తెలుస్తుంది.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తీ అయింది. కానీ, గ్రాఫిక్ వర్క్ కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యం అయినట్టు తెలుస్తోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాయిబాబా జాగర్లమూడి మరియు రాజీవ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

x