ట్విట్టర్ లో సోను సూద్ మరియు మంత్రి కేటీఆర్ కు మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. మంత్రి కేటీఆర్ సోను సూద్ ను సూపర్ హీరో అంటూ ట్వీట్ చేశారు.

తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ గారు ట్విట్టర్ లో ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటారు. ముఖ్యంగా, కరోనా వైరస్ వంటి కఠినమైన సమయాల్లో కేటీఆర్ గారు అన్ని ట్విట్స్ కు చురుగ్గా స్పందిస్తూ వారికి సహాయం చేస్తున్నారు. కేటీఆర్ గారు ఇప్పటికే అవసరమైన ప్రతి ఒక్కరికి సహాయం చేసినందుకు వారి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇటీవల కేటీఆర్ నుండి సహాయం పొందిన ఒక వ్యక్తి ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలుపుతూ కేటీఆర్ ను సూపర్ హీరో గా సంబోధించాడు. మీరు చాలా మందికి సహాయం చేశారు మరియు తెలంగాణ ప్రజలకు మీరు చేస్తున్న సహాయం మేము ఎప్పటికి మర్చిపోలేము అంటూ ట్వీట్ చేశారు.

ఆ వ్యక్తి ట్వీట్ కు స్పందించిన కేటీఆర్ “నిజమైన హీరో సోను సూద్ మాత్రమే” అని చెప్పారు. కేటీఆర్ గారు చేసిన ట్వీట్ కు స్పందించిన సోను సూద్ ” తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నటిస్తుందని అన్నారు ” అయితే కేటీఆర్ ను సార్ అంటూ ట్విట్టర్లో సంబోధించాడు సోను సూద్. దీనిపై బదులు ఇచ్చిన మంత్రి కేటీఆర్ బ్రదర్ అంటే చాలు అని రీ ట్వీట్ చేశారు.

x