తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా టెస్లా కంపెనీ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టెస్లా అధినేత చాలా కాలం నుంచి తమ కార్లను భారత దేశంలో ప్రవేశపెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు సంవత్సరాల నుంచి ఈ విషయంపై మాస్కు కు, భారత ప్రభుత్వం కు మధ్య అనేక చర్చలు జరిగాయి. కానీ, ఎలాంటి ఫలితం లేదు.

అసలు ఏం జరిగిందంటే, టెస్లా అధినేత ‘ఎలాన్ మస్క్’ ముందు బయట దేశాల్లో ఉత్పత్తి అయిన తమ కార్లను భారతదేశంలో ప్రవేశపెడతామని దానికి సుంకాన్ని తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.. దానికి భారత ప్రభుత్వం, ముందు దేశంలో ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేస్తేనే సుంకంలో రాయితీ కల్పిస్తామని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే, ఓ నెటిజన్ ‘టెస్లా కార్లును ఇండియా లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు’ అని ఎలాన్ మస్క్ కు ట్వీట్ చేశాడు. భారత ప్రభుత్వం తో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ.. ఇప్పటికీ తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నామని ఎలాన్ మస్క్ ఆ నెటిజన్ కు సమాధానం ఇచ్చారు. ఎలాన్ మస్క్ భారత ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేగుతున్నాయి. దీంతో ఆ వ్యాఖ్యల్ని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అది చర్చనీయాంశంగా మారింది.

టెస్లా కార్ల కంపెనీ కు సంబంధించిన షోరూమ్స్ తెలంగాణలో ఏర్పాటు చేయాలని కేటీఆర్ ఎలాన్ మస్క్ కు ట్వీట్ చేశారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ అభివృద్ధిలో చాంపియన్ గా మరియు బిజినెస్ డెస్టినేషన్ గా మారిందన్నారు. టెస్లా తో భాగ్యసామ్యం అవ్వటం తమకు సంతోషం అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

x