కర్నూలు జిల్లా నంద్యాల లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న దంపతులను ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భార్య సరస్వతమ్మ మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. వీరు క్రాంతి నగర్ నుండి నంద్యాల కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.