జంగావ్ జిల్లా, పెంబర్తి గ్రామంలో బంగారు లంకె బిందె దొరకటం సంచలనం సృష్టించింది. ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ వెంచర్ వేద్దామని భూమిని చదురు చేస్తుండగా బంగారు లంకె బిందె కనిపించండి. ఈ విషయం అధికారులకు చేరడంతో బిందె ను స్వాధీనం చేసుకున్నారు చేసుకున్నారు.

నరసింహ వెంచర్ వేద్దామని ల్యాండ్ ను తీసుకొని దానిని చదురు చేస్తున్నారు. ఇంతలో భూమిలో ఏదో అనుమానాస్పద వస్తువు కనిపించింది. ఏమిటా అని అనుమానంగా బయటకు తీసి పరిశీలించగా ధనలక్ష్మి సత్కరించింది, బంగారు లంకె బిందె దొరికింది. హైదరాబాద్ కు చెందిన నరసింహ పెంబర్తి గ్రామ పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నారు.

దీనికోసం వరంగల్, హైదరాబాద్ జాతీయ రహదారికి సమీపంలో 11 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిలో వెంచర్ ఏర్పాటు కోసం జెసిబి తో భూమిని చదురు చేస్తుండగా లంక బిందె కనిపించింది. వెంటనే భూమి యజమాని నరసింహ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి బిందెను తెరిచి చూడగా అందులో 17 తులాల బంగారం, 10 కిలోల వెండి లభ్యం అయింది.

నరసింహ కు కొన్ని రోజులుగా తనకు కలలో అమ్మవారి కనిపిస్తోందన్నారు. తన భూమిలోనే లంకె బిందె దొరికిన నేపథ్యంలో ఇక్కడ అమ్మవారి గుడి కట్టించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ భాస్కర్ రావు, తాసిల్దార్ రవీందర్, గ్రామ సర్పంచి ఆంజనేయులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. మరోవైపు పురావస్తు శాఖ అధికారులు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరపాలని స్థానికులు కోరుతున్నారు.

image source

x