కరోనా మహమ్మారి ఏ రంగాన్ని వదిలిపెట్టడం లేదు. సినీ ఇండిస్టీ లో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఈ కరోనా వల్ల చనిపోయారు. తాజాగా ప్రముఖ తెలుగు సీనియర్ సింగర్ “జి ఆనంద్” కోవిడ్ తో పోరాడి నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు గత కొన్ని రోజులుగా జి ఆనంద్ కోవిడ్ కు చికిత్స పొందుతున్నాడు.
ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటం వల్ల జి ఆనంద్ శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొన్నాడు. అతనికి సరైన సమయానికి వెంటిలేటర్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆయన మరణించినట్లు తెలిసింది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
జి ఆనంద్‌ను 1976 లో తమిళనాడులో నవతా కృష్ణరాజు సంగీత దర్శకుడు జికె వెంకటేష్ పరిచయం చేశారు. అతని తొలి పాట ఒక వేణు సూపర్ హిట్ అయ్యింది. ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘విఠలా విఠలా పాండురంగ విఠలా’ వంటి అనేక పాటలు అతని కెరీర్‌లో ఉత్తమమైనవి.
ఘంటసాల మరణం తరువాత జి ఆనంద్ చాలా మంది స్టార్ హీరోలకు తన గాత్రాన్ని ఇచ్చాడు.