పాక్ లో ఇద్దరు నేతల మధ్య ఫైటింగ్ జరిగింది. టీవీ లైవ్ షో లో అసభ్యకరంగా తిట్టుకున్నారు. అంతేకాదు సహనం కోల్పోయిన వారిద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మాద్యమాల్లో వైరల్ అవుతుంది.

చీఫ్ మినిస్టర్ ఇన్ఫర్మేషన్ స్పెషల్ అసిస్టెంట్ ఆషిక్ అవన్, పీపీపీ లీడర్ ఖదీర్ ఖాన్ మధ్య టీవీ షోల వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఖదీర్ ఖాన్ అవినీతికి పాల్పడ్డారని అవన్ ఆరోపించారు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్ళింది. ఈ వ్యవహారంపై అవన్ తర్వాత ఒక ట్వీట్ చేశారు. ఖదీర్ ఖాన్ తనతో అసభ్యకరమైన భాష ఉపయోగించారని, అది తనకు కోపం తెప్పించిందని ఆమె ట్వీట్ చేశారు. ఒకానొక సమయంలో తనను బెదిరించారని ఆమె ఆరోపించారు. చానల్ వాళ్లు పూర్తి వీడియో రిలీజ్ చేయాలంటూ ఆమె కోరారు.

x