మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు మరియు ప్రపంచంలోని నాల్గవ ధనవంతుడు బిల్ గేట్స్ తన భార్య మెలిండా గేట్స్‌తో విడాకులు తీసుకుంటున్నట్టు వచ్చిన ప్రకటనతో చాలా మంది ఆశ్చర్య పోయారు. 130 బిలియన్ డాలర్ల ఒప్పందంతో బిల్ గేట్స్ మరియు మెలిండా వారి 27 సంవత్సరాల వివాహ జీవితానికి ముగింపు పలికారు.
బిల్ గేట్స్ మరియు మెలిండా పిల్లల సంగతి ఏమిటంటే, వారికి ముగ్గురు పిల్లలు, అందులో ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు. జెన్నిఫర్ గేట్స్‌కు 25 సంవత్సరాలు కాగా, 21 ఏళ్ల కుమారుడు రోరి, 18 ఏళ్ల కుమార్తె ఫోబ్. బిల్ గేట్స్ తన పిల్లలకు కుటుంబ సంపదలో ఒక శాతం కన్నా తక్కువ ఆస్తి వారసత్వంగా ఇస్తున్నాడు.
దీనికి సంబంధించి, 2017 లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు ఇలా అన్నాడు, “పిల్లలకు భారీ మొత్తంలో ఆస్తి వదిలివేయడం వారికి అనుకూలంగా ఉండదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నా పిల్లలకు ఒక్కొక్కరికి కేవలం 10 మిలియన్ డాలర్లు వారసత్వంగా ఇస్తాను అని చెప్పాడు – ఇది అతని సంపదలో 1 శాతం కన్నా తక్కువ. ” బిల్ గేట్స్ సంపాదనలో ఎక్కువ భాగం ప్రపంచవ్యాప్తంగా పనిచేసే గేట్స్ ఫౌండేషన్‌లోకి వెళుతుంది.
పెద్ద కుమార్తె జెన్నిఫర్ ఇప్పుడు న్యూయార్క్ నగరంలో మెడికల్ స్టూడెంట్. ఆమె 2018 లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి హ్యూమన్ బయాలజీ లో పట్ట పొందింది. ఆమె 2020 జనవరిలో ప్రొఫెషనల్ ఈజిప్షియన్ ఈక్వెస్ట్రియన్ రైడర్ అయిన నయెల్ నాసిర్ ను నిశ్చితార్థం చేసుకుంది.