గుంటూరు జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు మండలం లో వారం రోజులపాటు ఆంక్షలు విధించారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపు మాత్రమే షాపులు ఉంటాయని MRO శ్రవణ్ కుమార్ గారు తెలిపారు.
కరోనా విస్తరించకుండా ఉండటం కోసం షాపులకు ఈ సమయం ప్రకటించామని MRO శ్రవణ్ కుమార్ గారు తెలిపారు. ఈ మధ్యకాలంలో వెల్లటూరు లో ఇద్దరు, అక్కిరెడ్డిపాలెం లో ఒకరు కరోనాతో పోరాడి చనిపోయారు. MRO శ్రవణ్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రజలందరూ వ్యక్తిగత దూరం పాటించాలని మరియు మాస్కులు తప్పకుండా ధరించాలి అని, శానిటైజర్ లు కూడా తప్పకుండా వాడుకోవాలనని తెలిపారు.
మాస్కులు లేకుండా రోడ్డు మీదకు వచ్చిన, గుంపులు గుంపులుగా జనం ఉన్నా వారికి వెయ్యి రూపాయల దాకా ఫైన్ విధిస్తామని ఆయన తెలిపారు. ఒక వారం రోజులపాటు ఈ పరిస్థితి కొనసాగుతుందని దాని తర్వాత కరోనా తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటామని ఆయన MRO శ్రవణ్ కుమార్ గారు తెలిపారు.