తెలంగాణాలో మరో 10 రోజుల పాటు అమలు చేయనున్న లాక్ డౌన్

తెలంగాణలో మరో పది రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొదట ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు ఇచ్చింది. అయితే, జనం ఇళ్లకు చేరుకునేందుకు మరొక గంట వెసులుబాటు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనితో మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేయనున్నట్లు తెల్సింది.

తెలంగాణ ప్రభుత్వం మే 12 నుంచి లాక్ డౌన్ పెట్టిన సంగతి మనకు తెలుసు. ఈ రోజు తో గడువు ముగియడంతో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. అంటే ఈ లాక్ డౌన్ జూన్ 10 వరకూ అమల్లో ఉండనుంది. సీఎం కేబినేట్ మీటింగ్‌లో అందరు చర్చించి, మరో పది రోజులు లాక్ డౌన్ పెంచడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చారు.

రేపటి నుంచి భూముల రిజిస్ట్రేషన్ లకు అనుమతి ఇచ్చిన క్యాబినెట్, రవాణా శాఖలో వాహనాల రిజిస్ట్రేషన్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు తెలంగాణలో 7 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సంగారెడ్డి, జగిత్యాల, వనపర్తి, మోహబూబాబాద్, కొత్తగూడెం నాగర్కర్నూల్, మంచిర్యాలలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు.

x