ఈ మధ్యకాలంలో ప్రేమికులు తమ ప్రేమను ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యకు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఇదే విధంగా సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ పెళ్లికి ఇంట్లో పెద్దలు అంగీకరించకపోవడంతో ఆ ప్రేమ జంట మంజీరా నది లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా భగత్ సింగ్ నగర్ కు చెందిన కృష్ణవేణి అనే అమ్మాయి, రాజంపేట కు చెందిన అనిల్ అనే అబ్బాయి కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరు తమ కుటుంబ సభ్యులకు తమ ప్రేమ గురించి తెలిపి వివాహం చేయమని కోరారు. కానీ తమ కుటుంబ సభ్యులు వారి వివాహానికి అంగీకరించలేదు.

కారణం ఏమిటంటే, ఇరువురు సామాజిక వర్గాలు వేరు కావడం మరియు అమ్మాయి అబ్బాయి కన్నా నాలుగు సంవత్సరాలు పెద్దది కావడం. దీంతో వారి కుటుంబ సభ్యులు ఈ వివాహానికి అంగీకరించలేదు. ఆ ప్రేమ జంట చేసేది ఏమీ లేక ఈ నెల 5వ తేదీన తమ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. చివరికి పోలీసులు కృష్ణవేణి మృతదేహాన్ని మంజీరా నదిలో గుర్తించారు. అనిల్ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు.

x