నాగ చైతన్య హీరోగా డైరెక్టట్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమాలో నాగ చైతన్య కు జోడిగా సాయి పల్లవి నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలకు, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం లోని ‘సారంగదరియా’ పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది.

మొదట ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ, మూవీ మేకర్స్ ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయాలనీ భావించారు. దీంతో ఈ సినిమా విడుదల ఆలస్యం అయ్యింది. తాజాగా మూవీ మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 10న ఈ మూవీ థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కె. నారాయణదాస్ నారంగ్ & పి. రామ్మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ & అమిగోస్ క్రియేషన్స్ క్రింద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని మొదలైన వారు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సి.హెచ్ పవన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

x