అంతరిక్షంలో ఈ రోజు ఒక అద్భుతం జరగనుంది, ఈ ఏడాది తొలి సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుంది. ఈ రోజు ఏర్పడుతున్న చంద్ర గ్రహణాన్ని బ్లాక్ మూన్ గా పిలుస్తున్నారు. చంద్ర గ్రహణం సమయంలో చందమామ పూర్తిగా నలుపు రంగులో కనిపించనుంది.

ఈరోజు మధ్యాహ్నం చంద్రగ్రహణం ఏర్పడనుంది. సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డుగా రానుంది ఆ సమయంలో సూర్య కిరణాలు చంద్రుడిపై పడవు దీంతో చంద్రుడు బ్లాక్ మూన్ గా కనిపించనున్నాడు. సూర్యుడు, చంద్రుడు మరియు భూమి ఈ సమయంలో ఒకే రేఖ పైకి రానున్నారు.

తూర్పు ఆసియా దేశాలు, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్ర దీవులు మరియు ఉత్తర అమెరికాలో చంద్రగ్రహణం పూర్తి గా కనిపిస్తుంది. దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రంలో కొన్ని చోట్ల ఏకంగా గ్రహణాన్ని చూడవచ్చు. అయితే భారతీయులకు మాత్రం పాక్షికంగా గ్రహణం కనిపిస్తుంది.

భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు చంద్రగ్రహణం మొదలవుతుంది. సాయంత్రం 04 గంటల 39 నిమిషాలకు సంపూర్ణం అవుతుంది. ఆ సమయంలో చంద్రుడు పూర్తిగా కనిపించదు. సాయంత్రం 4 గంటల 58 నిమిషాలకు గ్రహణం వదిలేసే ప్రక్రియ మొదలవుతుంది. ఆ సమయంలో చందమామ గుండ్రం గా కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటల 23 నిమిషాలకు చంద్ర గ్రహణం పూర్తిగా తొలగిపోయి సంపూర్ణ చందమామ కనిపిస్తుంది.

గ్రహణం సమయంలో చందమామ ఎరుపు, నారింజ, గోధుమ రంగులో కనిపిస్తుందని భౌగోళిక శాస్త్ర అధ్యాపకులు అంచనా వేస్తున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు మొదలై సాయంత్రం 6 గంటల 22 నిమిషాలకు ముగుస్తుందని చెబుతున్నారు.

x