చాలా మంది వ్యక్తులు నేరాలకు పాల్పడి, చట్టవిరుద్ధమైన మార్గాలను ఎంచుకొని శిక్ష నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. హైదరాబాద్ కు చెందిన సృజన హై స్కూల్ వ్యవస్థాపకుడు తన కుమారుడుని శిక్ష నుంచి కాపాడుకోవడానికి ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నాడు. అయితే హైదరాబాద్ పోలీసులు అతని ప్రణాళికను కనుగొని హై స్కూల్ వ్యవస్థాపకుడు ను అరెస్టు చేశారు.

వివరాల్లోకి వస్తే, రఘునందన్ రెడ్డి హై స్కూల్ వ్యవస్థాపకుడు. అతని కుమారుడు సుజిత్ రెడ్డి గోవాలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతను జూన్ 26న తన స్నేహితుడు ఆశిష్ రెడ్డి తో కలిసి రామ్‌కీ టవర్స్ పక్కన ఉన్న వారి గెస్ట్ హౌస్ కి వెళ్లాడు. అక్కడ వారు పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో వారు మద్యం తీసుకున్నారు. వారు కారులో తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మాదాపూర్ సమీపంలో ఒక ఆటోని ఢీకొట్టారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఉమేష్ అనే వ్యక్తికీ తీవ్ర గాయాలయ్యాయి మరియు ఆటో డ్రైవర్ కూడా కొంత గాయాలయ్యాయి. ఇంతలో ఉమేష్ చికిత్స పొందుతూ మరణించాడు.

పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను తనిఖీ చేసి ఆ కారు నంబర్ ను గుర్తించారు. దీంతో పోలీసులు రఘునందన్ రావు ని పిలిపించారు. అతను తన డ్రైవర్ ను ఆ సమయంలో వాహనాన్ని నడుపుతున్నట్లు ఒప్పుకోమని చెప్పి తన కొడుకుని కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే, డ్రైవర్ మరియు రఘునందన్ చెప్పిన సమాధానాలతో పోలీసులు సంతృప్తి చెందలేదు. దీంతో పోలీసులు అసలు విషయాన్ని తెలుసుకున్నారు. ఆ విధంగా పోలీసులు సుజిత్ రెడ్డి, ఆశిష్ రెడ్డిని అరెస్టు చేశారు. తన కొడుకును కాపాడటానికి చట్టవిరుద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నందుకు రఘునందన్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

x