ప్రముఖ తెలుగు స్టార్ కృష్ణ కుమారుడు మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు (56) శనివారం కన్నుమూశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది నటీనటులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. రమేష్ బాబు ఘట్టమనేని వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి బాల నటుడిగా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఆయన సినీ ఇండస్ట్రీలో హీరోగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
మహేష్ బాబుకు తన అన్నయ్యను చివరిసారిగా కూడా చేసుకోలేకపోయాడు. రీసెంట్ గా మహేష్ బాబు కు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆయన ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అందుకే మహేష్ బాబు తన అన్నయ్య అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు. అయితే మహేష్ బాబు తన అన్నయ్య మీద ఉన్న ప్రేమను తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన అన్నయ్య గురించి తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఇలా రాసుకొచ్చారు. “మీరు నాకు చాలా స్ఫూర్తిగా నిలిచారు.. అన్నయ్య నువ్వే నా బలం.. నువ్వే నా ధైర్యం.. నువ్వే నా సర్వస్వం.. నువ్వు లేకుంటే ఈరోజు ఉన్న మనుషిలో సగం కూడా ఉండేవాడిని కాదు. మీరు నా కోసం చేసిన ప్రతి దానికి ధన్యవాదాలు.. అంటూ తన అన్నయ్య పట్ల తనకున్న అపారమైన ప్రేమను చాటుకున్నారు.
View this post on Instagram
నాకు మరో జీవితం అనేది ఉంటే నువ్వే నా అన్నయ్య గా ఉండాలి. నిన్ను ఇప్పటికీ, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను” అంటూ మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు.