క్షణం, అమీ తుమీ, గూఢచారి, ఎవరు వంటి సుస్పెన్స త్రిల్లర్ చిత్రాలతో ఆకట్టుకున్న ఆదివి శేష్ ప్రస్తుతం సుస్పెన్స నేపథ్యంలో సాగె మేజర్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్ని మహేష్ బాబు నిర్మిస్తుండంగా, గూఢచారి దర్శకుడు శశి కిరణ్ తిక్క డైరెక్టర్ గా చేస్తున్నాడు. అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుంది.

ఆదివి శేష్ నటించిన పాన్ ఇండియా సినిమా “మేజర్” టీజర్ రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ “మేజర్” యొక్క హిందీ టీజర్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు “మేజర్” టీజర్ యొక్క తెలుగు వెర్షన్ను విడుదల చేయగా, పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళ వెర్షన్ను విడుదల చేయనున్నారు.

త్రీ సూపర్ స్టార్స్ మేజర్ టీజర్ ప్రారంభించడంతో, ఇది అన్ని భాషల ప్రేక్షకులను అక్కట్టుకుంటుంది.

2008 లో 26/11 ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా “మేజర్” సినిమా తెరకెక్కనుంది. శశి కిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జూలై 2 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

x