తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో “సర్కార్ వారి పాట” సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు ఊహగానాలు వచ్చాయి.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు బాక్సాఫీసు వద్ద దుమ్ము లేపాయి, అయితే ఈ కాంబినేషన్ పై ఈ రోజు కొత్త అప్డేట్ రానుందని సినీవర్గాలల్లో ఒక టాక్ వచ్చింది. ఇప్పటికే మహేష్ బాబు తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అనౌన్స్మెంట్ ఉంటుందని తెలియగా, ఈరోజే 4: 05 నిమిషాలకు ఈ అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ssmb28 అప్డేట్ ఉందని తెలిసేసరికి సోషల్ మీడియాలో #SSMB28 ట్రెండ్ చేశారు.

x