పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు వీరిద్దరూ టాలీవుడ్ లో టాప్ హీరోస్, వీరు వృత్తి పరంగా ప్రత్యర్థులు. కానీ వారి అభిమానులు తరచుగా సోషల్ మీడియాలో ఒకరి పై ఒకరు బురదజల్లడం మరియు అనవసరమైన తగాదాలను రేకెత్తిస్తున్నారు. కానీ స్టార్ హీరోలు ఇద్దరూ ఎప్పుడూ ఒకరితో ఒకరు స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించారు.

ఇప్పుడు ఇద్దరు హీరోల అభిమానులందరినీ హత్తుకునే విదంగా మహేష్ బాబు తన ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం వకీల్ సాబ్‌పై ప్రశంసల ట్వీట్ చేశారు. వకీల్‌సాబ్‌లో సినిమాలో “పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ పవర్ ప్యాకెడ్ అని, అద్భుతమైన రీఎంట్రీ మూవీ అని ” మహేష్ బాబు ట్వీట్ చేశారు, ఈ ట్విట్ ఇద్దరి ఫాన్స్ అభిమానులకు ఆనందాని ఇచ్చింది.

సూపర్ స్టార్ ప్రకాష్ రాజ్ గురించి చెబుతూ , అతని చేసిన ” యాక్టింగ్
బ్రిలియెంట్ ” అని ప్రశంసించాడు. ఈ చిత్రంలో యాక్ట్ చేసిన ప్రముఖ హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ, ” నివేత థామస్, అంజలి మరియు అనన్య నాగల్లా చేసిన యాక్టింగ్, హార్ట్ టచింగ్ పెరఫార్మెన్సు” అని చెప్పారు. అంతేకాకుండా తమేన్ సంగీతం స్కోరు “అగ్రస్థానం” అని మహేష్ బాబు ట్విట్ చేసాడు. ఆ పై వకీల్ సాబ్ మొత్తం జట్టును అభినందించారు.

x