మహీంద్రా షోరూమ్​లో బొలెరో పికప్ ట్రక్ ను కొనేందుకు వెళ్ళిన రైతు ను అక్కడ ఉన్న సేల్స్ మెన్ అవమానించాడు. 10 రూపాయలు అనుకొని వచ్చినట్లున్నారు బయలుదేరండి.. అంటూ ఆ సేల్స్ మెన్ రైతుని అవమానించాడు. దీంతో వెంటనే ఆ రైతు 10 లక్షలు తీసుకువచ్చి ఆ సేల్స్ మెన్ కు బుద్ది చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

ఈ సంఘటన కర్ణాటక లో జరిగింది. కర్నాటకలోని తుమకూరు జిల్లా కు చెందిన కెంపెగౌడ అనే రైతు తన మిత్రులతో కలిసి మహేంద్ర షో రూమ్ కి వెళ్లాడు. ఆ రైతు బొలెరో పికప్ వాహనం చూపించమని అడిగాడు. అయితే వారి వేషధారణ చూసిన సేల్స్ మెన్ అవమానకరంగా మాట్లాడాడు. కారు ధర 10 రూపాయలు అనుకొని వచ్చినట్లున్నారు బయలుదేరండి.. కారు కొనడానికి ఇంతా మంది గుంపుగా వస్తారా.. అంటూ హేళనగా మాట్లాడాడు. బలవంతంగా వారిని బయటకు పంపేశాడు.

షోరూమ్ నుంచి బయటకు వెళ్లిన ఆ రైతు ఒక గంటలో 10 లక్షలు సమకూర్చుకున్నాడు. 10 లక్షల నెట్ క్యాష్ తీసుకొని నేరుగా షో రూమ్ లోకి వెళ్ళిన ఆ రైతు బొలెరో పికప్ వాహనం డెలివరీ ఇవ్వాలని చెప్పాడు. కార్లు స్టాక్ లేకపోవడంతో నాలుగు రోజుల సమయం కావాలని షో రూమ్ లోని ఆ సేల్స్ మాన్ చెప్పాడు. దీంతో ఆ రైతుకు ఒక్కసారిగా కోపం వచ్చింది. నువ్వెంత నీ బతుకెంత అంటూ తిట్టిపోశాడు.

రూ.10 రూపాయలు లేవంటూ నన్ను అవమానిస్తావా.. అని ఆ సేల్స్ మాన్ పై మండిపడ్డాడు. డబ్బు తీసుకువచ్చాను కారు ఇవ్వు అంటూ నిలదీశాడు. దీంతో చివరికి సేల్స్ మాన్ ఆ రైతుకు క్షమాపణలు చెప్పాడు. అక్కడ జరిగిన విషయం మొత్తాన్ని రైతు స్నేహితులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మహీంద్రా గ్రూప్ ​చైర్మన్​ఆనంద్ ​మహీంద్రాకు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

x