మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ తన సినిమాలను ఓటిటి ప్లాట్‌ఫామ్‌లపై విడుదల చేసే పనిలో ఉన్నారు. సి యూ సూన్, ఇరుల్ మరియు జోజి వంటి సినిమాలను ఇప్పటికే ఓటిటి లో విడుదల చేసి మంచి స్పందన అందుకున్నారు. ఇప్పుడు మరొక చిత్రాన్ని ఓటిటి లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఆ చిత్రం పేరు “మాలిక్”. మొదట మూవీ మేకర్స్ ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా డిజిటల్ విడుదలను ఎంచుకున్నారు. చివరకు ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. తాజాగా “మాలిక్” ట్రైలర్ ను కొద్దీ సేపటి క్రితం విడుదల చేశారు.

ఈ చిత్రం యాక్షన్ డ్రామా గా తెరకెక్కింది. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ వేర్వేరు వయసులను సూచించే వేర్వేరు గెటప్‌లలో కన్పించారు. ఈ సినిమాకు మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించారు. ఇందులో ‘నిమిషా సజయన్’ హీరోయిన్ గా నటించింది. వినయ్ ఫోర్ట్, జలజా, జోజు జార్జ్, దిలీష్ పోథన్ వంటి వారు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ నెల 15న ‘మాలిక్’ అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులోకి రానుంది.

x