మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలోని మైనా గ్రామంలో నివసిస్తున్న కైలాష్ బాగ్‌బాన్ ‘పాయిజన్ మ్యాన్’ గా ప్రసిద్ధి చెందారు. ప్రజలు అతన్ని ‘పాయిజన్ మ్యాన్’ లేదా ‘విష్ పురుష్’ అని ఎందుకు పిలుస్తారు అనే దానికి కారణం చక్కగా సరిపోతుంది.

అతనికి బల్లి వంటకాలను తినే అసాధారణ అలవాటు ఉంది, అవును మీరు సరిగ్గానే చదివారు, అతను బల్లులు తింటాడు!

అతను ప్రతిరోజూ సుమారు 10 బల్లులు తింటాడు. అతను తినే అన్ని వంటకాలలో, బల్లి సూప్ అతనికి చాలా ఇష్టమైనది. అతను సలాడ్ రెసిపీగా సరీసృపాలను సజీవంగా తింటాడు. గోడలపై లేదా నేలమీద బల్లి అతని కంట పడటం ఆలస్యం, అందరిలాగా అరచి పారిపోవటానికి బదులుగా, అతను దానిని వేటాడతాడు మరియు వాటి యొక్క రక్తాన్ని జ్యుసులాగా సంతోషంగా ఆస్వాదిస్తాడు.

He eats 10 lizards daily 2

బల్లి మాత్రమే కాదు, అతను ఇప్పటివరకు 60 ఇతర విషపూరిత కీటకాలు మరియు సరీసృపాలు జీర్ణించుకున్నాడు.

అతనికి బల్లులు తినే అలవాటు ఎలా, ఎప్పుడు మొదలుపెట్టాడు అని అడిగినప్పుడు, కైలాష్ ఇలా అంటాడు, “నేను చిన్నతనంలో, కీటకాలతో ఆడటం చాలా ఇష్టం. వాటితో ఆడుతున్నప్పుడు, నేను అనుకోకుండా ఒకటి లేదా రెండు నోటిలో ఉంచాను; నేను వాటి రుచిని ఇష్టపడ్డాను మరియు తరువాత వాటిని క్రమం తప్పకుండా తినడం ప్రారంభించాను. ఇప్పుడు నాకు మెడిసిన్ కంటే బల్లి చాలా అవసరం. పడుకునే ముందు, నాకు బల్లి కావాలి, లేకపోతే నేను నిద్రపోలేను ”అని అతను చెప్పాడు.

అతని గ్రామంలో లేదా సమీప గ్రామాలలో పాముకాటు సంఘటనల విషయంలో, కైలాష్ సహాయం కోరతారు. విషం పీల్చడం ద్వారా అతను చాలా మంది ప్రాణాలను రక్షించాడు. అతని అలవాటు అసాధారణంగా అనిపించవచ్చు, కాని అందరికి సహాయపడే అలవాటుకి అందరు అతన్ని ఇష్టపడతారు.

“నేను ప్రాణాలను రక్షించేటప్పుడు ప్రజలు నన్ను ప్రేమిస్తారు. అదే సమయంలో, వారు నన్ను విచిత్రంగా చూసినప్పుడు అది నన్ను బాధిస్తుంది. వారు సాధారణంగా నేను ఉపయోగించిన పాత్రలను పక్కన ఉంచుతారు, ”అని ఆయన చెప్పారు.

x