సంతోశ్‌ శోభన్‌ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ఈ సినిమాలో హీరోయిన్ గా మెహరీన్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి పాటను చిత్రబృందం ఇటీవలే విడుదల చేసింది. ‘సో సోగా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే’ అంటూ సాగే ఈ పాటను మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విడుదల చేశారు.

సంతోశ్‌ మరియు మెహరీన్‌ మధ్య కెమిస్ట్రీ బాగుంది. కె.కె. సాహిత్యం అందించిన ఈ పాటను సిధ్‌ శ్రీరామ్‌ చక్కగా పాడారు. అనూప్‌ రూబెన్స్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. యువీ కాన్సెప్ట్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వినోదాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

x