సమాజం పట్ల ప్రేమను కలిగి ఉన్న వ్యక్తి మంచు మనోజ్. రేపు తన పుట్టినరోజు సందర్బంగా సంబరాలను ప్రత్యేకమైన రీతిలో జరుపుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. సాధారణ సంబరాలను తొలగించి కరోనా తో బాధపడుతున్న ప్రజలకు సాయం చేయాలని మంచు మనోజ్ నిర్ణయించుకున్నారు.

దీంతో తన అభిమానులు మరియు మిత్రులతో కలిసి తెలుగు రాష్ట్రాల్లో 25 వేల కుటుంబాలకు అవసరమైన నిత్యావసర వస్తువుల మరియు కిరణ సామాగ్రిని అందజేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. రాబోయే రోజుల్లో 25 వేల కుటుంబాలకు మంచి ఈ సహాయం కొనసాగిస్తామని ఆయన అన్నారు. మనోజ్ కొద్దిసేపటి క్రితమే తన ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.

ఆయన మాట్లాడుతూ “ముందుగా మన ప్రాణాన్ని కాపాడడానికి, తన ప్రాణాన్ని మరియు కుటుంబాన్ని పణంగా పెట్టి మన అందరికి సహాయం చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు” తెలిపారు. “ఇలాంటి సమయంలోనే మాస్కులు ధరించి, తరచూ శానిటైజర్ చేసుకుంటూ మన ప్రపంచాన్ని మనమే కాపాడుకోవాలి” అని ఆయన సూచించారు. ఈ క్లిష్టమైన సమయంలో దయచేసి ఇంట్లో ఉండండి అంటూ ఆయన కోరారు.

మనోజ్ చేస్తున్న ఈ పనికి అందరూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం మనోజ్ అహం బ్రహ్మాస్మిలో నటించనున్నారు.

x