బాలీవుడ్ ప్రముఖ నటి, యాంకర్‌ మందిరా బేడీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త రాజ్ కౌశల్ కన్నుమూశారు. మీడియా ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆయన బుధవారం తెల్లవారు జామున 4:30 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు అతనికి వైద్య సహాయం అందించడానికి ప్రయత్నించారు. కానీ ఏ ఉపయోగం లేకుండా పోయింది.

రాజ్ కౌశల్ ఒక యాడ్ ఫిల్మ్ మేకర్. 1998లో తన సొంత యాడ్ నిర్మాణ సంస్థను స్థాపించిన తర్వాత, అతను 800 వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించారు. రాజ్ తన కెరీర్లో మూడు చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. అవి, ప్యార్ మెన్ కబీ కబీ, షాదీ కా లడ్డు మరియు ఆంటోని కౌన్ హై వంటి చిత్రాలను తెరకెక్కించారు.

మందిరా బేడీకి, రాజ్ కౌశల్ కు 1999 ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. 2011లో వీరికి ఒక కుమారుడు జన్మించాడు. కుమారుడి పేరు వీర్. అక్టోబర్ 2020 లో మందిరా మరియు రాజు 4 ఏళ్ళ ఆడ పిల్లను దత్తత తీసుకున్నారు. మందిరా బేడీ ఇటీవల ప్రభాస్ నటించిన సాహూ మూవీ లో నటించారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ పెద్దలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

x