కరోనా వైరస్ తో ప్రపంచమంతా వణికిపోతుంటే, అంతకుమించి ప్రమాదకరమైన కొత్త వైరస్ వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా పశ్చిమ ఆఫ్రికాలోని గినియా దేశంలో మార్ బర్గ్ అనే మరో మహమ్మారి పుట్టుకొచ్చింది. ఇది ఎబోలా కు సంబంధించిన ప్రాణాంతకరమైన వైరస్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది.

మానవాళిని వణికించే ఈ వైరస్ కరోనా లాగే ప్రాణాంతకరమైన వైరస్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించండి. గినియా లో ఇటీవలే మరణించిన వ్యక్తి నుంచి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్ ను గుర్తించినట్లు ఆరోగ్య సంస్థ తెలిపింది. గబ్బిలాల్లో ఉండే ఈ వైరస్ యొక్క మరణాల రేటు 88 శాతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వేగంగా వ్యాప్తి చెందే మార్ బర్గ్ వైరస్ ను వెంటనే నిలువరించాలని లేకపోతే ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే ఆఫ్రికాలో స్థానికంగా, దేశీయంగా అత్యంత ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎబోలా ను కట్టడి చేయడంలో గినియాకు ఉన్న అనుభవాన్ని తాము ఉపయోగించుంటున్నట్లు ఆఫ్రికా ప్రాంత వైద్యులు చెబుతున్నారు. అక్కడి ప్రభుత్వానికి మద్దతుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. గబ్బిలాల నుంచి ఒకసారి ఈ వైరస్ మనిషికి సోకితే శరీర స్రావాల ద్వారా మార్ బర్గ్ వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉండి.

తాజాగా గినియా లోని ఓ అటవీప్రాంత వ్యక్తిలో జులై 25న ఈ వైరస్ వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. స్థానికంగా చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందారు. పోస్టుమార్టం రిపోర్టులో ఎబోలా నెగిటివ్గా మరియు మార్ బర్గ్ పాజిటివ్ గా తేలింది. గతంలో దక్షిణాఫ్రికాలో ఈ వైరస్ వెలుగుచూసిన, పశ్చిమ ఆఫ్రికా లో గుర్తించడం మాత్రం ఇదే తొలిసారి. ఈ వైరస్ బారిన పడ్డవారికి ఒక్కసారిగా తీవ్ర జ్వరం, తలనొప్పి, అసౌకర్యంతో భాదపడుతూ ఉంటారు. ఈ వైరస్ బారిన పడినవారు 24 నుంచి 88 శాతం వరకు మృతి చెందే అవకాశం ఉంది. ఇప్పటివరకు దీనికి ఆమోదం పొందిన టీకాలు, చికిత్సలు అందుబాటులో లేవు.

x