మహారాష్ట్రలో విరార్ జిల్లాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విజయ్ వల్లభ కోవిడ్ హాస్పటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో 13 మంది కోవిడ్ బాధితులు సజీవదహనం అయ్యారు. ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగాయి. ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే పలువురు రోగులకు గాయాలు కావడంతో వారిని ఇతర ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.

image source

x