సికింద్రాబాద్ లోని రాణి గంజి లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాణి గంజి లోని ఒక కాంప్లెక్స్ లో, ఫుట్వేర్ షాప్ లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు చుట్టుపక్కల ఉన్న షాపులకు కూడా వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదం తో పక్కననున్న రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ వాసులు ఆందోళనకు గురయ్యారు.

ఈ మంటలను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వ్యాపిస్తున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఈ మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల రెండు షాపులు బూడిదయ్యాయి.

x