ముంబై లో 51 సవంత్సరాలు కలిగిన వైద్యురాలు కరోనా వల్ల మరణించారు. చనిపోవడానికి ముందు ఆమె పేస్ బుక్ లో ఒక పోస్ట్ చేశారు. డాక్టర్ మనీషా జాదవ్ ముంబై నగరంలోని “సేవ్రి టీబీ” హాస్పిటల్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు అంతేకాదు ఆమె క్షయ వ్యాధి నిపుణురాలు కూడా, అయితే కొద్దీ రోజులుగా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కూడా కరోనా భారిన పడడంతో చికిత్స తీసుకుంటున్నారు.
అయితే సోమవారం నుంచి ఆమె ఆరోగ్యం క్షిణించింది, ఈ విషియాన్ని గమనించిన మనీషా జాదవ్ పేస్ బుక్ లో చివరి పోస్ట్ చేశారు. ఆ పోస్టులో ఆమె ఇలా చెప్పింది, “బహుశా ఇది నా చివరి గుడ్ మార్నింగ్ కావచ్చు, ఇక నేను మిమ్మలిని కలవలేకపోవచ్చు, అన్ని జాగత్తగా చూసుకొంది, ఈ శరీరం చనిపోబోతుంది” అని పోస్ట్ చేశారు. ఇది చుసిన స్నేహితులు మీకు ఏమి కాదు సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగి వస్తారు అని పోస్ట్ చేశారు. కానీ ఆమె తిరిగి రాలేదు, పేస్ బుక్ లో పోస్ట్ పెట్టిన సుమారు 36 గంటల్లో ఆమె చనిపోయారు. దీనితో ఆమె స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.