మహారాష్ట్రలోని వంగని రైల్వే స్టేషన్ లో పట్టాలపై పడిపోయిన చిన్నారిని ప్రాణాలకు తెగించి రైలు కి ఎదురు వెళ్లి మరి కాపాడిన మయూర్ షెల్కేను సెంట్రల్ రైల్వే సత్కరించింది. ముంబాయి హెడ్ ఆఫీస్ లోని అధికారులు మరియు సిబ్బంది అందరూ చప్పట్లు కొడుతూ మయూర్ కు ఘనంగా స్వాగతం పలికి అతని సాహసాన్ని అభినందించారు.అసమాన ధైర్యాన్ని ప్రదర్శించిన అతన్ని ఘనంగా సత్కరించారు.

పట్టాలపై చిన్నారి పడిపోగానే, అదే ట్రాక్ పై రైలు రావడాన్ని గమనించిన మయూర్ వెంటనే స్పందించి రెప్ప పాటు కాలంలో రైలుకు ఎదురు వెళ్లి చిన్నారిని కాపాడడంతో పాటు తనను తాను కూడా కాపాడుకున్నాడు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ను సెంటర్ రైల్వే నిన్న విడుదల చేయడంతో క్షణాల్లో దేశమంతా వైరల్ గా మారింది. బాబును కాపాడేందుకు తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టిన అతని సాహసాన్ని ప్రతి ఒక్కరు అభినందించారు.

x